
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026: ఫిఫా..ఫిఫా.. ఫిఫా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫిఫా ఫివర్ షురూ అయ్యింది. కోట్లాదిమంది ఫుట్ బాల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మధురక్షణం రాణేవచ్చేసింది. హిస్టరీలోనే అత్యంత పెద్ద ఫుట్ బాల్ పండగ ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచులో కో హోస్ట్ మెక్సికో దుమ్మురేపింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ హోరాహోరీ పోరులో 2-0 తేడాతో మెక్సికో క్లీన్ విన్ అయ్యింది.
కాగా ఈసారి వరల్డ్ కప్ చరిత్రలోనే మొదటిసారిగా మూడు దేశాలు అమెరికా, మెక్సికో, కెనడా కలిసి ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 48 టీమ్స్ 104మ్యాచుల్లో కప్ కోసం పోటీ పడబోతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం మెక్సికో సిటీ స్టేడియం సరికొత్త హంగులతో ముస్తాబు అయ్యింది. మూడు వేరువేరే వరల్డ్ కప్ ఎడిషన్స్ నిర్వహణతో అజ్టెకా స్టేడియం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి.
ఇక మ్యాచ్ కంటే ముందు జరిగిన ఓపెనింగ్ సెర్మనీ మాత్రం వేరేలెవల్లో జరిగిందని చెప్పాలి. లాటిన్, ఆఫ్రికన్, ఇంటర్నేషనల్ పాప్ స్టార్స్ స్టేడియంలో చమటలు పట్టించారు. గ్లోబల్ పాప్ క్వీన్ షకీరా స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో స్టేడియంలో దద్దరిల్లింది. నైజీరియన్ ఆఫ్రోబీట్స్ లెజెండ్ బర్నా బాయ్ తో కలిసి షకీరా చేసిన ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్ డైడై పాడుతూ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ వెర్రొళ్లు అయ్యారు. వీరితోపాటు కొలంబియన్ సింగర్ జె బాల్విన్ కూడా తన పాటలతో స్టేడియంలోని వేలాది మందికి పిచ్చెక్కించాడు. ట్రెడిషనల్ పాపెల్ పికాడో థీమ్ తో స్టేడియం రూఫ్ టాప్ నుంచి వేలాది కలర్ ఫుల్ బ్యానర్లు వేలాదీయగా స్టేడియంను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు.
అటు టాస్ గెలిచి మైదానంలోకి అడుగు పెట్టిన మెక్సికో టీమ్ గ్రీన్ కలర్ జెర్సీలో, సౌతాఫ్రికా ఎల్లో కలర్ జెర్సీలో అదుర్స్ అనిపించాయి. మ్యాచ్ ప్రారంభం అవ్వగానే 9వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ జూలియన్ క్వినోన్స్ అదిరిపోయే గోల్ తో టీమ్ కు 1-0ఆధిక్యాన్ని అందించడం విశేషం. ఈ గోల్ తో స్టేడియంలోని 83వేల మంది ఫ్యాన్స్ సంతోషంతో ఎగిరి గంతేశారు. ఆ తర్వాత 17వ నిమిషంలో సౌతాఫ్రికా ప్లేయర్ మొకోయోనాకు టోర్నిలోనే ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చాడు రెఫరీ. ఈ మ్యాచ్ లో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే హైడ్రేషన్ బ్రేక్ రూల్ తీసుకురావడం మొదటిసారి అని చెప్పాలి. మ్యాచ్ 24 నిమిషంలో ఆటగాళ్లు నీళ్లు తాగి ఫ్రెష్ అయ్యేందుకు రెఫరీ విజిల్ ఊదాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి మెక్సికో 1-0 తో లీడ్ లో ఉంది.
ఇక సెకండ్ హాఫ్ షురూ అవ్వగానే మ్యాచ్ మరింత హీటెక్కిందని చెప్పాలి. 50వ నిమిషంలో సౌతాఫ్రికా ప్లేయర్ యాయా సిథోలెకు రెఫరీ రెడ్ కార్డు చూపించి గ్రౌండ్ బయటకు పంపించారు. ఈ వరల్డ్ కప్ లో పడిన మొదటి రెడ్ కార్డు ఇదే అని చెప్పాలి. ఆ తర్వాత మెక్సికో స్టార్ ప్లేయర్ రావుల్ హిమినేజ్ అల్వరాడో ఇచ్చిన క్రాస్ పాస్ ను సూపర్ హెడర్ ద్వారా గోల్ గా మార్చి టీమ్ ను 2-0తో ముందంజలో నిలిచేలా చేశాడు. హిమినేజ్ వరల్డ్ కప్ లో తన అకౌంట్ ఓపెన్ చేశాడు. మ్యాచీ చివరీలో ఫ్యాన్స్ కు అసలైన డ్రామా కనిపించింది. 84వ నిమిషంలో సౌతాఫ్రికాకు చెందిన థెంపా జ్వానేకు సెకండ్ రెడ్ కార్డు పడింది. ఇక ఇంజూరీ టైమ్ లో మెక్సికో ప్లేయర్ సిజార్ మోంటెస్ కు కూడా రెడ్ కార్డు ఇవ్వడంతో మ్యాచులో మొత్తం 3 రెడ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యాయి.
భారతదేశంలో ఫీఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లు జీ5 యాప్, వెబ్సైట్లో ప్రసారం అవుతున్నాయి. లింక్: ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.