విప్రో రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన వాటాదారుల నుంచి ఒక్కో షేరుకు రూ.250 చొప్పున కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం మార్కెట్ ధరతో పోలిస్తే ఇది 40.9% అధికం విప్రో రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రారంభించింది. ఒక్కో షేరుకు రూ.250 చొప్పున కొనుగోలు చేయనుంది, ఇది మార్కెట్ ధర కంటే 40.9% ఎక్కువ. ఈనెల 17 వరకు అవకాశం ఉంది. జూన్ 5 రికార్డ్ తేదీ
Wipro Buyback: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో రూ.15000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బైబ్యాక్ ద్వారా అర్హులైన వాటాదారుల నుంచి ఒక్కో షేరుకు రూ.250 చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.177.40 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్ ధర 40.9 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అంటే బైబ్యాక్‌లో పాల్గొన్నవారికి దాదాపు 41 శాతం మేర లాభం రానుంది. 60 కోట్ల వరకు షేర్లను విప్రో తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ బైబ్యాక్ ఈనెల 17వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 5వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించారు. అంటే ఆ తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్లే బైబ్యాక్‌లో విక్రయించేందుకు అర్హులు. ఎన్ని షేర్లు విక్రయించవచ్చు?చిన్న వాటాదారులు (రికార్డ్ తేదీ నాటికి రూ.2 లక్షల కంటే తక్కువ విలువైన షేర్లను కొనుగోలు చేసి ఉన్న వాటాదారులు) తమ వద్ద ఉన్న ప్రతి 56 షేర్లకు గాను 11 షేర్లను ఈ బైబ్యాక్ ద్వారా విక్రయించడానికి (టెండర్ వేసేందుకు) అర్హత సాధిస్తారు. ఇక సాధారణ వాటాదారులు ప్రతి 197 షేర్లకు గాను 10 షేర్లను బైబ్యాక్ ద్వారా విక్రయించవచ్చు. తమ ప్రమోటర్లు, ప్రమోటరు గ్రూప్ సంస్థలు కూడా ఈ బైబ్యాక్‌లో పాల్గొనాలి భావిస్తున్నట్లు విప్రో వెల్లడించింది. ఎంపిక ప్రక్రియ ఇలా.. అర్హులైన వాటాదారులు ప్రత్యేక బైబ్యాక్ విండో ద్వారా బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈలోని బ్రోకర్ల ద్వారా ఎన్ని షేర్లు విక్రయించాలనుకుంటున్నామో బిడ్లు వేయవచ్చు. రిజిస్ట్రార్ జూన్ 19 నాటికి టెండర్ వేసిన షేర్లను ధ్రువీకరిస్తారు. తుది ఆమోదం లేదా తిరస్కరణను జూన్ 23 నాటికి ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం పేమెంట్లు, ఆమోదం పొందని షేర్లను జూన్ 24వ తేదీలోగా ప్రాసెస్ చేయడం వంటివి పూర్తి చేస్తారు. సెటిల్మెంట్ కోసం డీమ్యాట్ అకౌంట్లు క్రియాశీలకంగా ఉన్నాయని, బ్యాంక్ అకౌంట్ వివరాలు లింక్ అయి ఉన్నట్లు నిర్దారించుకోవాలని కంపెనీ తమ వాటాదారులకు సూచించింది. విప్రో షేరు ధరబైబ్యాక్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో విప్రో షేరు ధర ఫ్లాట్‌గా కదలాడింది. ఎన్ఎస్ఈలో 0.80 శాతం నష్టంతో రూ.177.50 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.273.10 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.175.83గా ఉంది. డివిడెండ్ ఈల్డ్స్ 6.20 శాతంగా ఉండగా పీఈ రేషియో 14.13గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.86 లక్షల కోట్లుగా ఉంది.