
హర్మూజ్ జలసంధి మూసివేత, ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పంపుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం
విధించింది. ఈ నిషేధం 90 రోజుల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపవద్దని రిటైల్ అవుట్లెట్ల యాజమాన్యానికి దిశానిర్దేశం చేసింది. పెట్రోల్ పంపుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్ |