కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు విపరీతమైన స్టార్డమ్ ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకు ఆశించిన
స్థాయిలో కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. సరైన హిట్లు లేక అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న తరుణంలో కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ ఏ జ్లో షేక్ అవుతుందో సూర్య తాజాగా నిరూపించారు. సూర్య 45వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కరుప్పు' (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఒక సాలిడ్ థియేట్రికల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల దాహాన్ని ఈ సినిమా పూర్తిగా తీర్చేసింది. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రానికి లభించిన అద్భుతమైన ఆదరణ సూర్య బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది.* 'పెద్ది' టిక్కెట్ ఆఫర్ల మాయాజాలం.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, పేమెంట్ దగ్గర అసలు ట్విస్ట్!మైండ్ బ్లాక్ చేసే లైనప్'కరుప్పు' సక్సెస్ ఊపులో ఉన్న సూర్య తన తదుపరి చిత్రాల జాబితాను మరింత క్రేజీగా ప్లాన్ చేసుకున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ విభిన్న కథాంశాలతో ఆయన అగ్ర దర్శకులను లైనప్‌లో పెట్టారు. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46వ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఆగష్టు 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సూర్య 47వ చిత్రానికి మలయాళంలో సంచలన విజయాలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటు సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చూపించే దర్శకుడు పా. రంజిత్, అలాగే సూర్యకు 'జై భీమ్' లాంటి క్లాసిక్ అందించిన టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్లలోనూ తదుపరి ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అనిల్ రావిపూడితో ల్యాండ్‌మార్క్ మూవీ?సూర్య వరుస చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆయన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం ( Suriya 50 ) గురించిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ మైలురాయి చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తర్వాత అత్యంత సాలిడ్ సక్సెస్ రేషియో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్స్తో పాటు పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో దిట్ట. ఇప్పటికే అనిల్ రావిపూడి సూర్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక అద్భుతమైన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను వినిపించారని, దానికి సూర్య కూడా బాగా ఇంప్రెస్ అయి సానుకూలంగా స్పందించారని టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా సెట్ అయితే, సూర్యను సరికొత్త మాస్ అవతార్‌లో చూడొచ్చు. వరుస బ్లాక్బస్టర్లతో టాలీవుడ్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, అటు సూర్య కూడా తన చేతిలో ఉన్న ప్రస్తుత కమిట్మెంట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే ఈ ప్రతిష్టాత్మక 50వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి కనీసం మరో రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు కమర్షియల్ హిట్ కోసం శ్రమించిన సూర్య ఇప్పుడు ఏకకాలంలో అరడజను భారీ ప్రాజెక్టులను లైనప్ చేసి తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను మరింత పెంచుకునే పనిలో పడ్డారు.