
పంజాగుట్ట, న్యూస్‌టుడే: సైబర్ మోసగాళ్లు ఓ ఏఎస్సైకి ఏపీకే ఫైల్ పంపి.. రూ.49,149 కాజేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సెల్‌ఫోన్‌కు ఆర్టీఏ చలాన్ పేరిట
సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్ పంపగా.. పొరపాటున ఆయన క్లిక్ చేశారు. అనంతరం ఈ నెల 8న తన సెల్‌ఫోన్‌కు పలుమార్లు సందేశాలు వస్తుండటంతో ఖాతాను పరిశీలించగా రూ.49,149 మాయం అయ్యాయి. తన ప్రమేయం లేకుండానే డబ్బు పోతుండటంతో నరసయ్య సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.