
Meenakshi Natarajan : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బిజెపి నేతలే సమాచారాన్ని లీక్ చేయడం వల్లే
ఈ తిరస్కరణ జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో స్పందించారు. తనపై ఉన్న క్రిమినల్ లేదా లీగల్ కేసుల గురించిన కనీస సమాచారం అభ్యర్థి అయిన మీనాక్షికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తప్పులు చేసి ఇతరులపై నెట్టడం సరికాదని, నామినేషన్ తిరస్కరణకు బిజెపి కారణమనే వాదనల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు మరియు కుట్రలు ఉన్నాయనే అనుమానాలను ఎంపీ అర్వింద్ వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చాటుగా సమాచారం లీక్ చేశారనే చర్చ కూడా నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనా, లేక పొట్టోడి కుట్రనా అనేది ఆ పార్టీ నేతలే సమీక్షించుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు ‘పొట్టోడు’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ప్రశ్నించగా, ఆయన సూటిగా రేవంత్ రెడ్డి పేరిట సమాధానం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాల వల్లే నామినేషన్ చెల్లకుండా పోయిందని అర్వింద్ ఆరోపించారు.
iPhone 17 Pro Max Discount: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Ponguleti Srinivas Reddy: తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: మంత్రి పొంగులేటి
CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
Meenakshi Natarajan nomination: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
Union Minister Bandi Sanjay : భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది: బండి సంజయ్
Government New Guidelines : విద్యార్థులకు అలర్ట్: చదువు మధ్యలో మానేస్తే స్కాలర్షిప్ వెనక్కివ్వాల్సిందే
BRS Objects on Kavitha Party Name : తెలంగాణ రాజకీయంలో ‘TRS’ వివాదం