
టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ బైలింగ్యువల్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’. అటు టాలీవుడ్‌లోనూ ఇటు కోలీవుడ్‌లోనూ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్
చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మత్స్యకారుల జీవితాలు, తీరప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంది.
రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌లను, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్లను షూట్ చేశారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ఇద్దరూ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో సుహాస్, సూరి ఒకరికొకరు ఎదురెదురుగా పవర్ఫుల్ లుక్‌లో నిలబడి కనిపిస్తున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ లాంటి టాప్ స్టంట్ మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.