
ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. జాంబియా దేశం అడుగున కొత్త టెక్టానిక్ ప్లేట్ సరిహద్దు ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నైరుతి ఆఫ్రికా భూ పగుళ్ల వ్యవస్థలో
‘కఫూ రిఫ్ట్’ అనేది ఓ భాగం. ఈ కఫూ టాంజానియా నుంచి నమీబియా వరకు విస్తరించి ఉన్న 2,500 కిలోమీటర్ల పొడవైన పగుళ్ల వ్యవస్థ. ఈ కఫూ వెంబడే విభజన జరుగుతోంది. తూర్పు ఆఫ్రికా నుంచి బోట్స్వానా, నమీబియా మీదుగా అట్లాంటిక్ మహాసముద్రం వరకు ఖండం విడిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. రెండుగా చీలిపోనున్న ఆఫ్రికా |