
తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి అందాల తారలు వివిధ రకాల ఆహార నియమాలు పాటించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం తెలిసిందే! అయితే తాను మాత్రం ఫిట్నెస్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన డైట్‌ని పాటించనంటోంది
టాలీవుడ్ నటి హన్సిక.
తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి అందాల తారలు వివిధ రకాల ఆహార నియమాలు పాటించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం తెలిసిందే! అయితే తాను మాత్రం ఫిట్నెస్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన డైట్‌ని పాటించనంటోంది టాలీవుడ్ నటి హన్సిక. బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ తన వంటల వ్లాగ్ కోసం చేసిన ఇంటర్వ్యూలో కూడా ఓ సింపుల్ వ్యాయామమే.. తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది హన్సిక.
‘నేను ఎలాంటి ఆహార నియమాలు పాటించట్లేదు.. రోజూ పిలాటిస్ సాధన చేస్తా.. ఈ వ్యాయామమే నన్ను ఫిట్‌గా, దృఢంగా, నాజూగ్గా ఉండేలా చేస్తుంది. అందుకే నన్ను నేను పిలాటిస్ గర్ల్‌గా పిలుచుకుంటా..’ అంటూ పంచుకుంది హన్సిక.
ఇలా తన అందానికి, ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు తాను రోజూ పాటించే సింపుల్ రొటీనే కారణమంటోంది.
⚛ నాకు ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు. ఆపై జాగింగ్ చేస్తూ జిమ్‌కి వెళ్తా. శారీరక ఫిట్నెస్ కోసం పిలాటిస్తో పాటు డ్యాన్స్ సాధన చేస్తా.
⚛ అప్పుడప్పుడూ స్కిప్పింగ్, స్విమ్మింగ్ నా వ్యాయామ రొటీన్లో చేర్చుకుంటా.
⚛ ప్రత్యేకంగా డైట్ అంటూ ఏమీ పాటించను కానీ ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటా.
⚛ నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీళ్లు, ఆపై చక్కెర లేకుండా తయారుచేసిన కప్పు గ్రీన్ టీ తాగుతా.
⚛ అల్పాహారంలో భాగంగా.. మల్టీగ్రెయిన్ టోస్ట్-మూడు కోడిగుడ్లలోని తెల్లసొనతో తయారుచేసిన ఆమ్లెట్ కలిపి తీసుకుంటా.
⚛ మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌లోకి తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటా. వీటిలోనూ ఉడికించిన కాయగూరలు, సలాడ్స్, పప్పన్నం.. తప్పకుండా ఉండాల్సిందే.
⚛ రాత్రుళ్లు ఆలస్యంగా అస్సలు తినను. డిన్నర్ కూడా 7 గంటల్లోపే ముగించేస్తా.
⚛ ప్రతి ఆదివారం నా ఛీట్ డే. ఈ రోజు నాకు నచ్చింది తింటా. అది కూడా ఆరోగ్యకరమైన పదార్థాలే.. మితంగానే తీసుకుంటా..’ అంటూ తన ఫుడ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.