
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Pawan Kalyan Allu Arjun Meeting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బన్నీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్‌కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు సర్జరీ తర్వాత రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలకు తప్ప ఆయన బయటకు రావడం లేదు. పవన్ కల్యాణ్ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి, ఆయన హెల్త్ కండిషన్‌తో పాటు కుటుంబ విషయాలను కూడా ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఫ్యాన్ వార్స్‌కు చెక్ పడినట్లేనా? గత కొంతకాలంగా సోషల్ మీడియాలో 'మెగా వర్సెస్ అల్లు' అభిమానుల మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న తరుణంలో, అల్లు అర్జున్ తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
మెగా, అల్లు హీరోలు ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్వయంగా పవన్‌ను కలవడంతో.. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ రంగాల్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హీరోగా తన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ (సుమారు రూ. 800 కోట్లు) చిత్రం 'రాకా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.