
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Peddapalli Paddy Procurement: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా.. రికార్డు స్థాయిలో ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి.. ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రికార్డు స్థాయిలో సేకరణ.. ఈ రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4 లక్షల 29 వేల 921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. దళారీల ప్రమేయం లేకుండా దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించామని తెలిపారు.. దీనికి తోడు మార్కెట్ యార్డుల ద్వారా మరో 25 వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా.. రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని.. చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు..
రైతుల నిల్వ అవసరాల కోసం.. పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేశామని విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్ల గోదాము పనులు ఇప్పటికే మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం.. ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పెద్దపల్లికి కాలేశ్వరం.. నీటి వల్ల పంటలు పండలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీల కాలం నాటి ఎస్ఆర్ఎస్పీ (SRSP) కెనాల్ నీటి వల్లే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలతో కట్టి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని... అందుకే ఆ బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని.. సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా ప్రతిపక్షాలు భయపడి ముందుకు రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.