
Peddapalli: ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్బంధ, అణిచివేత వైఖరికి వ్యతిరేకంగా సీఐ టీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో సామూహిక నిరసనదీక్షలు నిర్వహిం చారు.

సుల్తానాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్ష ణకు అధికారులు ప్రత్యేకశ్రద్ధతో పనిచే యాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యు డు జాటోత్ హుస్సేన్ అన్నారు

Manthani: మంథనిలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలో సుమారు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. గంగపురిలో 20 కోట్లతో న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బస్ డిపో నుంచి గోదావరినది వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 22 కోట్ల నిధులు, సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి వరకు 29 కోట్ల నిధులు, గుంజపడుగు నుండి విలోచవరం వరకు 8 కోట్లు, కూనారం నుండి ముత్తారం వరకు 36 కోట్లు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పలు గ్రామాలకు వైకుంఠ రథాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... మంథని అభివృద్ధికి రూ.164 కోట్లు కాదు.. రూ.800 కోట్ల నిధులు ఇచ్చిన తక్కువేనని అన్నారు. మంథని ప్రాంతానికి చేసిన సేవలకు ఈ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాకుండా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుతో కలిసి పనిచేసిన అదృష్టం తమకు దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నిరుపేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తుమ్మల తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి శ్రీధర్‌బాబును నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథనిలో నేడు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మంథని పట్టణాన్ని

Manthani: రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రేపు రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో పాటు రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గంగాపురి వద్ద న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.20 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద సీఎస్ఆర్ నిధులతో నాలుగు మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు మంజూరైన తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్ల విలువైన పలు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో మంథని పట్టణంలోని డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణతో పాటు మంథని–డిగ్రీ కళాశాల, మంథని–గోదావరి నాలుగు వరుసల రహదారి, సూరయ్యపల్లి–సీతంపేట, గుంజపడుగు–విలోచవరం, కూనారం–ముత్తారం రహదారి పనులు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ సహాయం, మైనార్టీలకు కుట్టు మిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు

Pegadapalli: పెగడపల్లిలో క్షుద్ర పూజల కలకలం మడేల్లయ్య స్వామి గుడిలో భయాందోళన! ఈ వార్తకు సంబంధించిన

ఓదెల, ఆగస్టు 14: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని సర్పంచ్ మద్దెవేని రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తిరిగి స్వచ్ఛ శుక్రవారం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో ఎక్కువగా వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు శుభ్రతను పాటించాలని కోరారు. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కేంద్రం ఏపీ,తెలంగాణా రాష్ట్రాలలో ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చెయ్యాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి ప్రాంతానికి విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం చేసింది. ఆపై తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా పెద్దపల్లి ఎంపీ డిమాండ్ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాకొక ఎయిర్ పోర్ట్ కావాలి అంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపల్లికి రావాల్సిన ఎయిర్‌పోర్ట్‌ను ఇతర ప్రాంతాలకు తరలించిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నేడు మండిపడిన ఆయన పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ ఎంతో అవసరమన్నారు.కేంద్రం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకే ఎయిర్ పోర్టులు, ఇతర ప్రాజెక్ట్ లుప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. అయితే కేంద్రం, బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే విమానాశ్రయాలు, ఇతర ప్రాజెక్టులను తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై కూడా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్న ఎంపీకేంద్రం ఆర్భాటంగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రాజెక్టులు ప్రారంభం కాకముందే లేదా కనీసం ఆరు నెలలు గడవకముందే కుప్పకూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు కేవలం హడావిడిగా కట్టే నిర్మాణాలు కాకుండా, తరాలపాటు నిలిచిపోయే నిర్మాణాలు కావాలన్నారు. తమకు నాణ్యమైన ఎయిర్పోర్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.పార్లమెంట్లో సరైన చర్చలు, సలహాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని వంశీకృష్ణ మండిపడ్డారు.మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్!పెద్దపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోండిప్రాంతీయ అసమానతలను పక్కనపెట్టి పెద్దపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు
ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం ప్రస్తుత స్థితి, ప్రాజెక్టు పురోగతి, తదుపరి కార్యాచరణపై మంత్రి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలనుకూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి, సురేశ్ షెట్కార్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ పనులు, కొత్త మౌలిక వసతుల కల్పన, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులను పరిశీలించి త్వరగా మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ ఉత్తర తెలంగాణలోని పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో ఇప్పటికే భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి ఉన్న నేపథ్యంలో కొత్త రైల్వే మార్గం సరుకు రవాణాతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే పరిశ్రమలకు ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభించే అవకాశం ఉందని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన రైల్ ఓవర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధుల

ఓదెల, ఆగస్టు 12 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో ముఖ్యమైన ప్రాంతాలు, కార్యాలయాలు తెలిపే విధంగా నేమ్ బోర్డులను బుధవారం సర్పంచ్ మద్దేవేని రవి యాదవ్ ఏర్పాటు చేయించారు. గ్రామ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోకి వచ్చే ప్రజలు, సందర్శకులు, అత్యవసర సేవలకు మార్గదర్శకంగా ఈ బోర్డులు ఉపయోగపడనున్నాయి. గ్రామంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వీధులు ప్రజా సౌకర్యాల గుర్తింపుకు ఈ నేమ్ బోర్డులు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామ అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. గోపరపల్లిని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వన్నెపురెడ్డి అనిల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మంథని గ్రామీణం: పెద్దపల్లి జిల్లా మంథని దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ మంథనిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, నాయకులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించడమే ఈ తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి. మంథనిలో జరిగిన ఈ తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మంథనిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కలిసి భరతమాత, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, మహాత్మగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలగు వేషధారణలతో పాల్గొనడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు