
ఓదెల, ఆగస్టు 14: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని సర్పంచ్ మద్దెవేని రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తిరిగి స్వచ్ఛ శుక్రవారం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో ఎక్కువగా వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు శుభ్రతను పాటించాలని కోరారు.
అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags:#swachh-friday#goparapalle#peddapalli-dist#telangana-news#telugu-news#india-news#039-swachh-friday
Found this helpful?
Share this story with your network









