
రఘునాథపాలెం, సెప్టెంబర్ 16 : బీసీల హక్కుల సాధన ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరి మాట్లాడుతూ.. రజతోత్సవ సభకు 33 జిల్లాల నుంచి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు భారీగా హాజరవుతున్నట్టు తెలిపారు.




