
పశ్చిమాసియా ఘర్షణల వేళ.. అమెరికా ఇజ్రాయెల్‌కు రూ.26వేలకోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని ఇచ్చేందుకు ఆమోదించింది. ఇందులో టన్ను బరువున్న 40 వేల బాంబులు ఉన్నాయి. వాటిలో 20వేల ఎంకే 84 , 20వేల బీఎల్‌యూ-117 బాంబులున్నాయని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అమెరికా ఆయుధాగారంలో విధ్వంసకరమైన ఆయుధాల్లో ఎంకే-84 ఒకటి. అందుకే బైడెన్‌ ప్రభుత్వం దీనిని నిలిపివేయగా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలుపుదలను ఎత్తివేయడంతో మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.




