
ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్‌కు రూ.26 వేల కోట్ల ($2.8 billion) భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది (USA-Israel). ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న 40 వేల బాంబులు ఉన్నాయి. వీటిలో 20 వేల ఎంకే 84 , 20 వేల బీఎల్‌యూ-117లు ఉన్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. వీటితోపాటు 20వేల ఐ-2000 పెనెట్రేటర్ వార్‌హెడ్స్ కూడా ఉన్నాయి. ఇవి నేల, కాంక్రీటు, రాళ్లను తవ్వుకొని వెళ్లి పేలతాయి. అమెరికా ఆయుధగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో ఎంకే-84 ఒకటి. ఇది పేలితే పెద్ద లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం ఎగిరిపడతాయి. ఇజ్రాయెల్ ఈ తరహా బాంబులను లెబనాన్‌, గాజాలో పలుమార్లు ఉపయోగించింది. దాంతో అప్పట్లో బైడెన్‌ ప్రభుత్వం వాటి డెలివరీని నిలిపివేసింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిలుపుదలను ఎత్తివేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి భారీ బాంబులను ఉపయోగించడం వల్ల పౌరులకు తీవ్ర నష్టం జరుగుతుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



