
ఏపీలో అసైన్డ్, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7.85 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొరపాటున అసైన్డ్గా నమోదైన 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు కూడా రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఫ్రీహోల్డ్‌కు అర్హత ఉన్నా ఉత్తర్వులు వెలువడని 64,143 ఎకరాలకు ప్రత్యేక ప్రక్రియ.. చుక్కల భూముల పరిధిలోని 17,897 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చారు.





