
ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ కమిటీ ఛైర్మన్ మెస్రం ఆనందరావుతో పాటు ఇంద్రవెల్లి మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మెస్రం భీంరావు ఆదివారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ముత్నూర్ సర్పంచి విఠల్, ఆసోద సర్పంచి నగేశ్, మాజీ ఎంపీటీసీ మనోహర్, మెస్రం దయాకర్, తదితరులు పార్టీలో చేరారు. ఇంద్రవెల్లి : రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో పాఠశాలల్లో పని చేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కార్మికుల జీతాలను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.28 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





