
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాలతో కీలక భేటీ నిర్వహించారు. కీలక దిశా నిర్దేశం చేసారు. ఈ నెలలోనే
తన కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. మిత్రపక్ష పార్టీలకు ఈ సారి ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కాగా, ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. జనసేన కు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో చేరిన తరువాత తొలి సారి జరుగుతున్న మంత్రివర్గ ప్రక్షాళనలో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. జనసేన తొలి సారి రాజ్యసభలో అవకాశం దక్కించుకుంది. లింగమేనని రమేశ్ పార్టీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడు అవుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ లోనూ ప్రాతినిధ్యం తీసుకోవాలనే అంశం పైన తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ.. ఒకరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ సారి ప్రక్షాళనలో వీరి శాఖలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీకి మరో మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నారని సమాచారం. టీడీపీ, జనసేన పార్టీల్లో ఒకరికి అవకాశం కల్పించేలా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.రాజ్యసభకు మిస్ - గవర్నర్ గా ఛాన్స్..!?కేంద్ర కేబినెట్ లోకి జనసేన..?దీంతో, ఈ సారి జనసేనకు మంత్రి పదవి దక్కనుందే చర్చ సాగుతోంది. జనసేన నుంచి ఇద్దరు లోక్ సభ.. తాజాగా రాజ్యసభ నుంచి లింగమేనని ఉన్నారు. అయితే.. సామాజిక సమీకరణాల లెక్క న కూటమి నేతలు కేంద్రంలోనూ మంత్రులుగా తమ ఎంపీలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుత సమీకరణాల్లో లింగమనేనికి అవకాశం లేనట్లే. కాగా.. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తొలి సారి ఎంపీ. గోదావరి జిల్లాల నుంచి ఇప్పటికే శ్రీనివాస వర్మ మంత్రిగా కొనసాగుతున్నారు. పురందేశ్వరి కి కీలక పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో.. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాల శౌరి పేరు తెర మీదకు వస్తోంది. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎంపీ అయ్యారు. అదే విధం గా పలు పార్లమెంటరీ కమిటీల్లోనూ పని చేసారు. సామాజిక లెక్కలు కలిసి రానున్నాయి. అయితే.. కేంద్రంలో మరో మంత్రిగా అవకాశం దక్కితే.. ఎవరికి కేటాయించాలనేది చంద్రబాబు, పవన్ సమిష్ఠిగా నిర్ణయం తీసుకోనున్నారు. జనసేన మంత్రి పదవి తీసుకోవాలని భావిస్తే.. బాలశౌరి పేరు రేసులో ఉన్నా.. పవన్ తుది నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది.