రెండు స్పూన్ల శనగపిండిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగుతాయి. అందం రెట్టింపు అవుతుంది. శనగపిండిలో పాలు కలిపి పేస్ట్ తయారు చేయండి
. దీన్ని ముఖానికి రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అందం రెట్టింపు అవుతుంది.
శనగపిండిలో కొంచెం మీగడ కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది. ముడతలు, చర్మం పగుళ్లు తగ్గుతాయి.
శనగపిండిలో కొంచెం అరటిపండు గుజ్జు, రెండు నుంచి మూడు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది.
రెండు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. 5 నిమిషాల తర్వాత చన్నీటితో ముఖాన్ని కడిగితే చర్మం మెరుస్తుంది.
రెండు స్పూన్ల శనగపిండిలో ఓట్మీల్, పాలు కలిపి ముఖానికి రాసుకోండి. ఈ ప్యాక్ చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. అందం రెట్టింపు అవుతుంది.
ఒక టీ స్పూన్ శనగపిండిలో మరో టీ స్పూన్ బియ్యం పిండి, కాఫీ పొడి, నీరు కలిపి ముఖానికి రాసుకోండి. ఈ ప్యాక్ మృతకణాలను తొలగిస్తుంది. చర్మాన్ని అందంగా మార్చుతుంది.
2 స్పూన్ల శనగపిండిలో పసుపు, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ మొటిమలను మాయం చేస్తుంది. అందాన్ని పెంచుతుంది.
శనగపిండిలో కీరదోస రసం కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. చర్మం హైడ్రేట్ అవుతుంది. పొడి చర్మం సమస్య తగ్గుతుంది.