
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదంపై ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు
Jun 11 2026 2:57 PM | Updated on Jun 11 2026 3:10 PM
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదంపై ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతున్న పైడిరాజు నిన్న (బుధవారం) ఉదయం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో గత సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. ఈ ఘటనపై రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. గాయపడినవారి ఆరోగ్య స్థితి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వివరాలు అందించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్బాల్ పండగ (ఫోటోలు)
కలర్ఫుల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
మరింత ఉచ్చులో బిగుసుకు పోయిన నందూస్ వరల్డ్ దంపతులు
టీడీపీకి షాక్.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట..
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..