
డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. ‘‘హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకోలేక విమర్శలు
చేస్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన అందరికీ ఉద్యోగాలు రావని నోటిఫికేషన్లోనే చెప్పాం. ఏకాంబరం అనే వ్యక్తికి 125 ర్యాంకు వచ్చింది.. అతను బీసీ డీ వ్యక్తి. బీసీ డీలో 110 ర్యాంకుల వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ఆన్లైన్ విధానంలో అంతా పారదర్శకంగా ఉంటుంది. రిజక్షన్ లిస్టు అంటూ ఏదీ పెట్టలేదు’’ అని తెలిపారు. హారిజాంటల్ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోలేకే విమర్శలు: కోన శశిధర్ |