
మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపిన భర్త అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి
వచ్చిన వివరాల ప్రకారం, అరుణ్ కుమార్ బీహార్ నుంచి అక్రమంగా తుపాకీని కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేయాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది నెలలుగా ప్రణాళిక రచించినట్లు విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం అరుణ్ కుమార్ పరారైనప్పటికీ, ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. కాగా, మూడు నెలల క్రితం కూడా తుపాకీతో హల్చల్ చేయడంతో అరుణ్ కుమార్ను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీ, హత్యకు దారితీసిన కారణాలు, ముందస్తు కుట్రకు సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నారు. మృతురాలు నిషారాణిని ఆమె భర్త అరుణ్ కుమారే అనుమానంతో కాల్చి చంపినట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు. భర్తతో పాటు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి, పిస్టల్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు...వాసుదేవ రెడ్డి అరెస్ట్
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది : సీఎం రేవంత్ రెడ్డి
.