
హైదరాబాద్: ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి
నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని ఈడీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. మద్యం రవాణాలో అవకతవకలతో నిందితులు ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. నిందితులు, వారి అనుచరులు అక్రమంగా ఆర్థిక లాభాలు పొందినట్లు గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్ |