
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Gold Price Crash News: బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకిస్తోంది. గత రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ పరుగు, అమ్మకాల ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది. అయితే ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా? రానున్న రోజుల్లో పసిడి రేట్లు మరింత పతనమవుతాయా? అనే విషయాలపై మార్కెట్ నిపుణుల నుండి ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.
ధరలు కుప్పకూలడానికి కారణాలు.. బంగారం ధరలు కుప్పకూలడం వెనుక అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ డాలర్ విలువ పెరగడంతో ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.
అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే స్థిరమైన ఆదాయం లేని బంగారం వైపు పెట్టుబడులు తగ్గుతాయి. వచ్చే డిసెంబర్ నాటికి అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 70 శాతానికి పైగా ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు మరింత ఎక్కువైంది. ఇది ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి దారితీసింది.
కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా, పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన యుద్ధ మేఘాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత, అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై, గల్ఫ్‌లోని మరో 21 ప్రాంతాలపై దాడులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక వ్యూహాలను, వడ్డీ రేట్ల అంచనాలను పునఃపరిశీలించేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ గోల్డ్ ఎనలిస్టులు ఒక కీలకమైన మార్క్‌పై కన్నేశారు. వారి విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,100 డాలర్ల స్థాయిని తాకవచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ధరలు ఈ మార్క్ కంటే దిగువకు పడిపోతే, పసిడి మార్కెట్లో సుదీర్ఘ కాలం పాటు భారీ పతనం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత మేర తగ్గే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.