
FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మూడు
FIFA World Cup 2026 opening ceremony being held in three countries
FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మూడు దేశాలు.. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మూడు దేశాలు కలిసి ఒకేసారి టోర్నీని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం 48 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. 16 స్టేడియాల్లో 39 రోజుల పాటు మొత్తంగా 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్‌కు మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ కూడా.. సింహభాగం మ్యాచ్‌లు అమెరికాలోనే జరగనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లలో అమెరికానే 78 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. కెనడా, మెక్సికోలు చెరో 13 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌తో సహా మెజారిటీ కీలక మ్యాచ్‌లన్నీ అమెరికా వేదికగానే జరగబోతున్నాయి.
మూడు దేశాల్లో వరుసగా మూడు రోజుల పాటు ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. మెక్సికో వేదికగా నేడు (జూన్ 11) మెక్సికో వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కన్నా ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
*Riyan Parag : రియాన్ పరాగ్‌కు ఏమైంది? ఆస్పత్రి బెడ్‌పై.. సర్జరీ..
ఇక రెండో రోజు కెనడా ఆతిథ్యం ఇస్తోంది. కెనడా వర్సెస్ బోస్నియా అండ్ హెర్జెగోవినా జట్ల మధ్య శుక్రవారం (జూన్ 12) శుక్రవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కెనడాలో కూడా ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కెనడియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇక ముచ్చటగా మూడో రోజు కూడా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ సారి అమెరికా వేదికగా జరగనున్నాయి. జూన్ 13న అమెరికా వర్సెస్ పరాగ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు ముందు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 5 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రసార హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. ఫుట్ బాల్ ప్రతక్ష్య ప్రసారం చేసేందుకు నాలుగు కొత్త ఛానెళ్లను ప్రారంభించింది. అవే.. యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి ఛానళ్లు. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. జీ5లో ప్రపంచకప్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేయనుంది.
*FIFA World Cup : 1994లో అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలుసా? అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అంటే?
జీ స్పోర్ట్స్ ఛానళ్లు, జీ5 ఓటీటీ సదుపాయం లేని వారు సైతం మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ‘దూరదర్శన్’ సరికొత్త ఏర్పాట్లు చేసింది. టోర్నమెంట్‌లోని కీలకమైన కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లను ‘డీడీ స్పోర్ట్స్’ (DD Sports) ఛానల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ తెలియజేసింది.