
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్‌గా తన
Jun 11 2026 3:13 PM | Updated on Jun 11 2026 3:17 PM
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్‌గా తన సేవలను ప్రమాదంలో పడేసిందంటూ సాక్ష్యమిచ్చారు. అంతేకాదు తన వివాహేతర సంబంధాల ఆదారంగా ఎప్స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు, వారి సమావేశాల ఉద్దేశం, ఎప్స్టీన్ నేరపూరిత కార్యకలాపాల గురించి ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలపై చట్టసభ సభ్యులు గేట్స్‌ను ప్రశ్నించారు. చట్టసభ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రహస్య విచారణలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ ఎప్స్టీన్తో పరిచయం తన ప్రతిష్టకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దెబ్బతినే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అసలు ఆయన్ని కలవడం తాను చేసిన అది పెద్ద తప్పిదమని బిల్ గేట్స్ అంగీకరించారు. నిజానికి అతని పరిచయం ప్రపంచ ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంపన్న దాతలను అనుసంధానించడంలో సహాయపడు తుందని తాన నమ్మానని గేట్స్ తెలిపారు. అయితే, ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు. అంతేకాకుండా, తాను ఎలాంటి నేరపూరిత చర్యలలో పాలుపంచుకోలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే ప్స్టీన్ ప్రైవేట్ దీవులు ప్రైవేట్ దీవి (ఐలాండ్), రాంచ్ లేదా ఫ్లోరిడాలోని నివాసాన్ని సందర్శించాననే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
మెలిందాతో వివాహ జీవితంపై బిల్ గేట్స్‌ను ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేశాడా? మరోవైపు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన వివాహ జీవితం వెలుపల ఉన్న సంబంధాల (Extramarital affairs) గురించి ఎప్స్టీన్కు తెలిసిందని, ఆ సమాచారాన్ని ఉపయోగించి తనతో సంబంధాలు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని గేట్స్ అంగీకరించారు. ఈ విషయాలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూశాడన్నారు. ఇవి తన కుటుంబానికి బాధను కలిగించాయని చెప్పారు. తనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తానెప్పుడూ సుముఖత చూపలేదని గేట్స్ పదే పదే నొక్కి చెప్పారు.
తమ మధ్య చర్చలు కేవలం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ అవకాశాలపై మాత్రమే జరిగాయని గేట్స్ స్పష్టం చేశారు. తాను ఆశించిన ఆర్థిక సహాయాన్ని ఎప్స్టీన్ అందించలేడని అర్థమైన తర్వాత, అతనితో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నట్లు గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ నెట్‌వర్క్‌పై కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి, ఈ కేసులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లు పెరుగుతుండటంతో, దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్‌బాల్ పండగ (ఫోటోలు)
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
మరింత ఉచ్చులో బిగుసుకు పోయిన నందూస్ వరల్డ్ దంపతులు
టీడీపీకి షాక్.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట..
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..