
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్ సంచలన ప్రకటన చేసింది. ప్రముఖ గాయకుడు గురు రంధావా, బాలీవుడ్ నటుడు
సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితంగా మెలగడమే ఈ దాడికి కారణమని గ్యాంగ్ పేర్కొంది.గురు రంధావాకు చెందిన ఫిట్‌నెస్ సెంటర్‌ టార్గెట్ గా దాడులు ఢిల్లీలోని వెస్ట్ విహార్ ప్రాంతంలో, గురు రంధావాకు చెందిన ఫిట్‌నెస్ సెంటర్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నారు. గురు రంధావాకు హెచ్చరిక జారీ చేయడమే ఈ దాడి ఉద్దేశమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గురు రంధావా గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్‌కు చాలా దగ్గరవుతున్నాడు. అందుకే ఢిల్లీలోని అతని జిమ్‌ను టార్గెట్ చేశామన్నారుబైక్ పై వచ్చి కాల్పులు తమ శత్రువులపై ఇదే తరహాలో మరిన్ని దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇక నిన్న జరిగిన దాడికి సంబంధించి పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఈ కాల్పులకు పాల్పడి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.ఘటనకు నేపథ్యం ఇదే సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య విభేదాలకు 1998నాటి కృష్ణజింకల వేట ఘటన ప్రధాన కారణం. హమ్ సాత్-సాత్ హైన్ సినిమా షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో సల్మాన్ ఖాన్, ఇతర నటులు కృష్ణజింకలను వేటాడారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2018లో జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారిల పేర్లు కూడా ఉన్నాయి.తెలంగాణ ఫ్యూచర్‌సిటీలో మరో 37 గ్రామాలు విలీనం.. ఆ విజ్ఞప్తులతో రేవంత్ నిర్ణయం!సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు బిష్ణోయ్ సమాజం కృష్ణజింకలను అత్యంత పవిత్రంగా భావిస్తుంది, అందుకే సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ గ్యాంగ్ పదేపదే దాడులకు పాల్పడుతోంది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి కెనడాతో పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పలు నేర ఘటనల్లో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారు సల్మాన్ ఖాన్ ను పదే పదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు.