
పశ్చిమ బెంగాల్ లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి
. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
తాజాగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బారైక్ పార్టీకీ, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకే వారంలో ముగ్గురు టీఎంసీకి గుడ్ బై చెప్పడం గమనార్హం. వరుస రాజీనామాలతో పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిక్ బారైక్ రాజీనామాకు గల కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి కారణంగానే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.
స్వయం ప్రకటిత క్రెడిట్.. మోడీ పాలనా రికార్డుపై కాంగ్రెస్ విమర్శలు
.