
ఫ్యూచర్ సిటీ(Future City) కేవలం మన కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 150 రోజుల్లోనే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశామన్నారు. వచ్చే ఎనిమిదేళ్లలో న్యూయార్క్ 9New York), టోక్యో (Tokyo), సింగపూర్‌తో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లే ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం లభించింది. బంగారం ధర కంటే రంగారెడ్డి (Ranga Reddy) భూముల ధరలే ఎక్కువ. ఆనాటి నిజాంలు, కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని అనేకసార్లు విస్తరించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. హైటెక్‌సిటీ, ఓఆరఆర్, జీనోమ్ వ్యాలీని అడ్డుకోవాలని చాలా మంది కుట్రలు చేశారు. నగరాన్ని విస్తరించకపోతే 10 లక్షల మంది ఐటీ నిపుణులు రాణించేవారా? ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్రల పన్నుతున్నారు. బీఆర్ఎస్ రద్దయిన నోటు. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇలాగే ప్రవర్తిస్తే వచ్చేసారి ప్రతిపక్షహోదా కూడా రాదు అని అన్నారు.