
ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) జలసౌధలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష
నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 11: ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) జలసౌధలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సీతమ్మసాగర్ సహా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టు ఖమ్మం భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు, పాత ఆయకట్టుకు స్థిరీకరణ చేస్తామన్నారు. మున్నేరు - పాలేరు అనుసంధానం.. ఖమ్మం, సూర్యాపేట రైతులకు వరమన్నారు. విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భద్రాచలం, ఖమ్మం వరద రక్షణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని.. ప్రతి ప్రాజెక్టుకు గడువులు నిర్దేశించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్
Read Latest Telangana News And Telugu News