
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Venomous Snake Video Watch Now: ప్రకృతిలో జీవించే వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు మన నివాస ప్రాంతాల్లోకి సంచారం చేసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.. ఊహించుకుంటేనే కొంత భయం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఒక అత్యంత అరుదైన వీడియో వైరల్ అవుతోంది. మనం నిత్యం ధరించే బూట్లలో పాములు దూరి కూర్చుంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.. ఈ వీడియో.. ఒక నల్లటి షూలో నక్కి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాము.. నెమ్మదిగా బయటకు వచ్చి.. పడగవిప్పిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ షాకింగ్‌కి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటర్నెట్లో రోజుకు లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం ఆకర్షించడమే కాదు.. చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఈ వీడియోలో ఒక నల్లటి షూ కనిపిస్తుంది. మొదటి చూపులో అందులో ఏముందో ఎవరికీ అర్థం కాదు.. కానీ, కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ షూ లోపలి భాగం నుంచి ఒక నల్లటి ఆకారం కదలడం మొదలవుతుంది. దీనిని క్లియర్‌గా గమనిస్తే.. అది ఒక అత్యంత విషపూరితమైన పాము అని స్పష్టమవుతుంది. షూ లోపల చాలా హాయిగా.. ఎవరికీ కనిపించకుండా చుట్టలు చుట్టుకుని కూర్చున్న ఆ పాము, బయట జరుగుతున్న కదలికలను గమనించి నెమ్మదిగా తన తలను పైకి లేపింది.
షూ నుంచి బయటకు వచ్చి.. అయితే, షూ లోపల ఉన్న పాము కేవలం తల అటుఇటు కదిలించడమే కాకుండా.. నెమ్మదిగా తన శరీరాన్ని బయటకు లాగడం ప్రారంభించింది. సగం శరీరాన్ని పైకి లేపి.. తన పడగను విప్పి భీకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. లేదా ఆ షూలో కాలు పెట్టేందుకు ప్రయత్నించి ఉన్నా.. తప్పకుండా కాటేసి ఉండేది.. అయితే, పాము పడగవిప్పి కెమెరా వైపు చూస్తున్న దృశ్యం నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.
ఊహించని స్థాయిలో వైరల్.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రీల్‌కు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో ఊహించని స్పందన లభిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఇకపై నేను షూస్ వేసుకునే ముందు వందసార్లు చెక్ చేసుకుంటాను బాబోయ్.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది కేవలం వీడియో కాదు.. మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక.. అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.