
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి వారం
ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అంచనాలకు తగ్గట్టుగానే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. తొలి వారం కలెక్షన్ల వివరాలతో కూడిన ఓ ప్రత్యేక పోస్టర్‌ను నిర్మాణ సంస్థ 'ఎక్స్' వేదికగా విడుదల చేసింది. వీక్ డేస్‌లోనూ ‘పెద్ది’ జోరు తగ్గకపోవడం గమనార్హం. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 12.9 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకుంది.ప్రస్తుతం ఉన్న వసూళ్ల జోరును బట్టి చూస్తే, ఈ వారాంతం ముగిసేలోగా ‘పెద్ది’ సులభంగా రూ. 400 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.