
జగన్ విశాఖ పర్యటన మరోసారి విమర్శలకు దారి తీసింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు ఆయన బుధవారం విశాఖకు వచ్చారు. ఈ నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు
. దీంతో నగరంలోని అల్లిపురం, డాబాగార్డెన్స్, జైల్ రోడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు, సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. అయితే, వైకాపా కార్యకర్తలు ఆస్పత్రిలో ఉన్నామనే విషయం మరిచిపోయి ఈలలు, కేకలతో రచ్చ చేశారు. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక దశలో జగన్ పక్కన ఉన్న వైకాపా నాయకులే వారిస్తూ సైగలు చేసినా పార్టీ కార్యకర్తలు వినిపించుకోలేదు. ఈ వార్త చదివారా: కుట్రలు తప్ప జగన్కు అభివృద్ధి పట్టదు: మంత్రి కొల్లు రవీంద్ర