
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్‌లోని ఫెరోక్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు
Jun 11 2026 1:13 PM | Updated on Jun 11 2026 1:16 PM
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్‌లోని ఫెరోక్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.
ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్‌పేషెంట్ విభాగానికి వచ్చారు. ఒక గిడ్డంగిని (Warehouse) శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీ ధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి మురళీధరన్ ప్రకటించారు.
ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రి బాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్‌బాల్ పండగ (ఫోటోలు)
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
స్పోర్ట్స్ కోటాలో స్కామ్స్ వింటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..బాబు, లోకేష్ పై జగన్ మాస్ ర్యాగింగ్
ఫుట్ బాల్ ముందు క్రికెట్ జుజుబీ ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు తెలుసా ..?
ఏపీలో కూడా కాక్రోచ్ లు వస్తాయి జాగ్రత్త.. లోకేష్‌కు జగన్ వార్నింగ్
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికి ఇస్తాం.... సంచలన ఆడియో లైవ్ లో ప్లే చేసి..!
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...