
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా తన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో కొత్తేం ఉందంటారా? ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు ఆసీస్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించడం గమనార్హం. 30 ఏళ్ల
నిఖిల్ చౌధరీని ఆసీస్ ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్ వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు. అతడి స్థానంలో నిక్కీకి క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో ఆసీస్ మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది.
నిఖిల్ చౌధరీ 1996లో భారత్‌లోనే పుట్టాడు. ఇక్కడి దేశవాళీలోనూ ఆడాడు. పదేళ్ల కిందటే అతడి కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఈ క్రమంలో నిక్కీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 1964 తర్వాత భారత్‌లో జన్మించి.. ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. గత బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నిక్కీ.. గత ఐపీఎల్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడు.
నిఖిల్ చౌధరీ పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకొన్నాడు. హర్భజన్ సింగ్ మార్గదర్శకంలోనూ ట్రైనింగ్ అయ్యాడు. దిల్లీలో పుట్టినప్పటికీ.. అతడు దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అటు బ్యాటర్‌గా.. ఇటు స్పిన్నర్‌గా నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో 32 మ్యాచులు ఆడిన అతడు 693 పరుగులు చేశాడు. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.