
ఇంటర్నెట్ డెస్క్: అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు యువ స్పిన్నర్ మానవ్ సుతార్. అఫ్గాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు
. బ్యాటింగ్‌లోనూ మెరుగైన ఆటతీరే ప్రదర్శించాడు. సీనియర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ అభిమానులు సంతోషపడ్డారు. ఈ క్రమంలో మానవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎర్రబంతి క్రికెట్లో మెరుగైన ఆటతీరు కోసం కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తర్వాత రెండు రౌండ్లలో ఆడతాడని వార్విక్షైర్ మేనేజ్మెంట్ ప్రకటించింది.
‘‘మా బౌలింగ్ యూనిట్‌కు సుతార్ వైవిధ్యం తీసుకొస్తాడు. కౌంటీ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అతడితో మేం ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది’’ అని వార్విక్షైర్ వెల్లడించింది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని మానవ్ సుతార్ తెలిపాడు.
తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్.. 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 129 వికెట్లు పడగొట్టాడు. అతడి బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 11/62. ఇక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే అతడు 950కిపైగా పరుగులు చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.