
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మిలిటరీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ఇరాన్‌పై అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగింది. దాంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆ
హెలికాప్టర్‌లోని పైలట్లను డ్రోన్ బోట్ సహాయంతో అమెరికా రక్షించింది. ఇలాంటి కీలక ఆపరేషన్‌లో పాల్గొన్న బోట్ తయారీ వెనక భారతీయ మూలాలున్న టెక్ ఎగ్జిక్యూటివ్ వైభవ్ ఆల్టేకర్ (Vibhav Altekar) పాత్ర ఉండటం విశేషం.
అమెరికా సైన్యం వినియోగిస్తున్న డ్రోన్ బోట్ కార్సెయిర్ (Drone Boat)ను సరోనిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. టెక్సాస్ కేంద్రంగా 2022, సెప్టెంబర్‌లో ఏర్పాటైన ఈ సంస్థకు భారతీయ మూలాలున్న వైభవ్ ఆల్టేకర్ సహ వ్యవస్థాపకులు. అలాగే, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఆయన లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. వైభవ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యసించారు. కంపెనీలో అటానమస్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ విభాగాన్ని చూసుకుంటున్నారు. అటానమస్ సిస్టమ్స్, మారిటైమ్ టెక్నాలజీలో నిపుణులు. గతంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలోని ఘోస్ట్ షార్క్ డ్రోన్ సబ్‌మెరైన్ ప్రోగ్రామ్‌లోనూ ఆల్టేకర్ (Vibhav Altekar) భాగమయ్యారు.
అటానమస్ సర్ఫేస్ వెస్సెల్స్ ఉత్పత్తి కోసం సరోనిక్ టెక్నాలజీస్‌కు, యూఎస్ నేవీకి మధ్య 392 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ఉంది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డినో మావ్రూకాస్.. నేవీ సీల్స్ (నేవీకి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్)లో 11 ఏళ్లపాటు పనిచేశారు. ఇక ఈ డ్రోన్ బోట్ విషయానికొస్తే.. 24 అడుగుల పొడవు ఉన్న కార్సెయిర్కు డీజిలే ఇంధనం. 35 నాట్స్ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. రిమోట్‌గా ఆపరేట్ అయ్యే దీని పరిధి 1,000 నాటికల్ మైళ్ల వరకు ఉంది. 1,000 పౌండ్ల (453 కేజీలు) బరువు మోయగలదు. హర్మూజ్‌లో అపాచీ కూలడంతో అందులోని పైలట్లను కాపాడేందుకు ఈ బోట్‌ను తొలిసారి ఉపయోగించారు (Drone Boat That Rescued US Pilots). అమెరికా నేవీకి చెందిన టాస్క్‌ఫోర్స్ 59 ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. ఏఐ సహాయంతో నడిచే డ్రోన్లు, మానవ రహిత వెస్సెల్స్‌ను ఈ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.