
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు
తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా, దాని గతిని మార్చే కొద్దిమంది నేతల్లో మోదీ ఒకరని చంద్రబాబు కొనియాడారు.గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజులు ప్రధానిగా సేవలందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. "ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దులోని సైనికుడి ధైర్యం వరకు.. ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా మోదీ చూశారు" అని అన్నారు.బలహీన వర్గాలకు మద్దతిస్తూనే, ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధికి బాటలు వేయడం ఆయన పాలనలోని ప్రత్యేకత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం తన భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో, లక్ష్యాలపై మరింత ఆశావహ దృక్పథంతో ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోదీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. వికసిత భారత్ అనే మోదీ దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్రను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.మోదీ రికార్డు అనితరసాధ్యం: నారా లోకేష్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కొనసాగుతుండడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా