నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Collections
Reviews
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt

వారణాసి’ లీక్స్ పై రాజమౌళి స్పందించడం లేదేంటి

Chitrajyothy29 May 2026, 5:59 pm
Share
X
వారణాసి’ లీక్స్ పై రాజమౌళి స్పందించడం లేదేంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి.. రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత రాజమౌళి.. ఈసారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నాడనే హింట్ వచ్చేసింది. కాకపోతే, రాజమౌళి సినిమా షూటింగ్స్‌కు విరుద్ధంగా.. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా? లీక్‌ల విషయంలో. అవును, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైమ్‌లో రాజమౌళి ఎంత కఠినంగా వ్యవహరించారో అంతా వింటూనే వచ్చారు. ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో కూడా ఆయన అంతే కఠినంగా వ్యవహరించినా.. లీక్స్ మాత్రం ఆగడం లేదు. ఆ మధ్య ‘వారణాసి’ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ సుకుమార్, మహేష్ కాంబోలో షూట్ చేస్తున్న ఓ సన్నివేశం లీకైనప్పుడు రాజమౌళి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇకపై, ఇలాంటి లీక్స్ వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని యూనిట్ మొత్తాన్ని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ హెచ్చరికల తర్వాత కొన్ని రోజులు ఎలాంటి లీక్స్ లేకుండా, అంతా సజావుగానే షూటింగ్ నడుస్తూ వస్తోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ, మళ్లీ ఈ సినిమాకు లీకుల బెడద మొదలైంది. తాజాగా ఈ మూవీకి అత్యంత కీలకమైన సెట్స్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమివడంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఉగ్ర‌భ‌ట్టి గుహ‌ల నేప‌థ్యంలో రీసెంట్‌గా చిత్ర‌బృందం కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలకు సంబంధించిన విజువ‌ల్స్ లీకవడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ఇంతకు ముందులా రాజమౌళి మాత్రం రియాక్ట్ కాలేదు. కారణం ఏమై ఉంటుందనేది తెలియదు కానీ, సోషల్ మీడియాలో

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి.. రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత రాజమౌళి.. ఈసారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నాడనే హింట్ వచ్చేసింది. కాకపోతే, రాజమౌళి సినిమా షూటింగ్స్‌కు విరుద్ధంగా.. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా? లీక్‌ల విషయంలో. అవును, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైమ్‌లో రాజమౌళి ఎంత కఠినంగా వ్యవహరించారో అంతా వింటూనే వచ్చారు. ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో కూడా ఆయన అంతే కఠినంగా వ్యవహరించినా.. లీక్స్ మాత్రం ఆగడం లేదు.


ఆ మధ్య ‘వారణాసి’ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ సుకుమార్, మహేష్ కాంబోలో షూట్ చేస్తున్న ఓ సన్నివేశం లీకైనప్పుడు రాజమౌళి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇకపై, ఇలాంటి లీక్స్ వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని యూనిట్ మొత్తాన్ని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ హెచ్చరికల తర్వాత కొన్ని రోజులు ఎలాంటి లీక్స్ లేకుండా, అంతా సజావుగానే షూటింగ్ నడుస్తూ వస్తోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ, మళ్లీ ఈ సినిమాకు లీకుల బెడద మొదలైంది. తాజాగా ఈ మూవీకి అత్యంత కీలకమైన సెట్స్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమివడంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఉగ్ర‌భ‌ట్టి గుహ‌ల నేప‌థ్యంలో రీసెంట్‌గా చిత్ర‌బృందం కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలకు సంబంధించిన విజువ‌ల్స్ లీకవడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ఇంతకు ముందులా రాజమౌళి మాత్రం రియాక్ట్ కాలేదు. కారణం ఏమై ఉంటుందనేది తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. లీక్ రాయుళ్లపై రాజమౌళి ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇదనేలా కొందరు, లీకైన సన్నివేశాలు సినిమాలో ఉండవనుకుంటా.. అందుకే రాజమౌళి రియాక్ట్ అవడం లేదని మరికొందరు.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత కామ్‌గా ఉన్నా.. జక్కన్న ట్రీట్‌మెంట్ వేరేలా ఉంటుందని వారికి తెలియదు. మరోవైపు.. ఈ లీక్‌ల బెడద నుంచి రాజమౌళి ఈ సినిమాను ఎలా కాపాడుతారో? అని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విజయ్ ‘జననాయగన్’ విషయంలో ఏం జరిగిందో గమనించి.. జక్కన్న మైండ్‌లో పెట్టుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Chitrajyothyలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

భోళా బాలయ్య సాంగ్ అద్భుతంగా ఉంది
CineJosh•14 Jun
ఆంటీ మోజులో పడి ప్రియురాలిని చెరువులో పడేసిన కిరాతకుడు
TeluguOne•14 Jun
వామ్మో.. పుట్టను చుట్టుకుని కోపంతో బుసలు కొడుతున్న కోడెనాగు.. వీడియో వైరల్
Zee Telugu•14 Jun
పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి
Zee Telugu•14 Jun
జూన్ 15 నుంచి 21 వరకు బ్యాంక్ సెలవలుపై కస్టమర్లకు కీలక అలర్ట్
Zee Telugu•14 Jun
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు
Chitrajyothy•14 Jun

English Keywords

#ss-rajamouli#varanasi#mahesh-babu#tollywood#business#telugu-news#india-news#varanasi-movie#varanasi-leaks#rajamouli-reaction
వారణాసి’ లీక్స్ పై రాజమౌళి స్పందించడం లేదేంటి | nimisham.in