
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Boat Accident In Krosuru News: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు (క్రోసూరు ప్రాంతం) సమీపంలోని కృష్ణా నదిలో ఆదివారం ఒక ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంధువుల ఫంక్షన్‌కు వచ్చి సరదాగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందంటే..? క్రోసూరు ప్రాంతానికి సంబంధించిన కోనూరులో జరిగిన ఒక బంధువుల శుభకార్యానికి కొందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సుమారు 10 మంది (విద్యార్థులు) కలిసి కృష్ణా నదిలో సరదాగా విహారయాత్ర (బోటింగ్) చేయడానికి ఒక చిన్న పడవలో బయలుదేరారు. అయితే, నదిలో కొంతదూరం వెళ్లాక తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న 10 మందీ నీటిలో మునిగిపోయారు. మృతదేహాలు లభ్యం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నదిలోకి దూకారు. నీటిలో మునిగిపోతున్న వారిలో ఆరుగురిని సమయస్ఫూర్తితో ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే, మిగిలిన నలుగురు వ్యక్తులు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఇద్దరి కోసం నదిలో తీవ్రంగా గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు ఎక్కడి నుంచి వచ్చారు? మృతుల వివరాలు ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో స్థానికులు, బంధువుల రోదనలతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి
.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.