
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cobra hulchul on anthill rare video viral: పాముల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తారు. ఒకప్పుడు పాములు కన్పిస్తే భయపడిపారిపోయే వారంతా ఇప్పుడు కోబ్రాలు కన్పిస్తే వెంటనే తమ ఫోన్ లను బైటకు తీసి వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటితో రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా కోబ్రాలు కాటు వేస్తే వాటిపైన దాడి చేసి మరీ చంపేస్తున్నారు. కొంత మంది చనిపోయిన పాముల్ని మెడలో వేసుకుని ఆస్పత్రులకు వెళ్తుంటే, మరికొంత మంది బతికున్న కోబ్రాల్ని నేరుగా చేతిలో పట్టుకుని ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో పాములు పుట్టలలో ఎక్కువగా ఉంటాయని చెప్తారు. అంతే కాకుండా అవి చల్లని గాలులకు లేదా కొన్నిసార్లు తొలకరి వానల సమయంలో పుట్టలో నుంచి బైటకు వచ్చి మరీ వాటిని చుట్టుకుంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాములల్లో కొడెనాగులు చిన్నవిగా ఉంటాయి. కానీ వీటిలో విషం పెద్దపాములలో ఉండేంతలానే ఉంటుంది. ఇవి చాలా కోపంగా ఉంటాయి. పొరపాటున వాటి దగ్గరకు వెళ్తే కాటువేస్తాయి. వైరల్ వీడియోలో కూడా కోడె నాగు పుట్ట మీద ఎక్కింది. దీన్ని ఎవరో అక్కడున్న వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు. అది కోపంతో అతనిపై
పలు మార్లు కాటు వేసేందుకు రెడీ అయిపోయింది.
Read more:Cobra Video: పాముల్ని కూడా డెలీవరీ చేస్తున్నారా..?.. బ్లింకిట్ ఏజెంట్ బ్యాగ్ నుంచి రోడ్డు మీద పడ్డ కోబ్రా.. వీడియో వైరల్..
అతను దాని కాటు నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా ఈ కోడెనాగు కదలికల్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి రిస్కీ స్టంట్ లు అవసరమా..?.. అంటూ ఏకీపారేస్తున్నారు.