
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంలో భాజపా
కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఓటు చోరీ, ఎస్ఐఆర్ తర్వాత భాజపా ఇప్పుడు సీటు చోరీకి పాల్పడుతోంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవు. ఎన్నికల సంఘాన్ని కలవడానికి వెళ్తే కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో, హైదర్‌గూడలో భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫొటోలు మీకోసం..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో కిడ్నీ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి.