
ఇంటర్నెట్‌డెస్క్: దేశంలో ఈకామర్స్ సంస్థలు అనుసరిస్తున్న డార్క్ ప్యాటర్న్స్ (Dark patterns) వల్ల చేతిచమురు వదులుతోంది. అలా వినియోగదారులపై ఏటా రూ.28వేల కోట్లవరకు వాతపడుతోంది. ఈ మేరకు ‘డార్క్
ప్యాటర్న్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్’ శీర్షికన మార్కెట్ రీసెర్చ్ సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
రహస్య ఛార్జీలు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్స్క్రిప్షన్ ఛార్జీల వంటి కారణంగా ఆన్లైన్ వినియోగదారుల్లో (Online shopping) 88 శాతం మంది.. ఒక్కొక్కరు నెలకు రూ.78 నుంచి రూ.87 వరకు కోల్పోతున్నారని పేర్కొంది. వస్తువు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. ఇలాంటి 13 రకాల డార్క్ పాటర్న్స్ను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గతంలోనే గుర్తించింది. వాటిలో కొన్ని..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.