
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆఖరిలో పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు ఇరాన్
- ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆపడం, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మన సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.
సెన్సెక్స్ ఉదయం 74,035.41 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,524.26) లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు నష్టాల్లోకి జారుకున్నా, తర్వాత కోలుకుంది. చివరికి 394.50 పాయింట్ల లాభంతో 73,918.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.10 పాయింట్ల లాభంతో 23,242.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.36గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టైటాన్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.