
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Kotha Malupu Release Date: టాలీవుడ్ ఫేమస్ నేపథ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో మూవీ ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. జూన్ 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆకాష్ మీడియాతో మాటా ముచ్చట కలిపారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు, తన క్యారెక్టర్ గురించి తల్లి గురించి కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
మీ ఫస్ట్ మూవీ ‘సర్కారు నౌకరి’తో పోలిస్తే ‘కొత్త మలుపు’ ఎలా డిఫరెంట్‌గా ఉండబోతుంది.
ఆకాష్: ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా డిఫరెంట్ జానర్ మూవీ. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్. లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడుస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమా కథను ఫ్రెష్‌గా ఫీలవుతారు. ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారు సినిమాకు ఈ టైటిల్ సూచించారు.
ఆకాష్: ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే పాత్ర ఇది. సీనియర్ల సలహాలతో, మా అమ్మ సూచనలతో నా ఫర్మార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాను.
ఈ కథలో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఏది?
ఆకాష్: దర్శకుడు శివ వరప్రసాద్ కథ చెప్పినప్పుడు అందులోని ట్విస్టులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎలా అయితే సరదాగా సాగిపోయే పాత్ర ఉండాలో అచ్చం అలాంటి పాత్రతో కూడిన సబ్జెక్టును డైరెక్టర్ చెప్పడంతో వెంటనే ఓకే చేశాను.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మద్దతు లభించడం ఎంతవరకు ఉపయోగపడింది?
ఆకాష్: మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాకు మా సినిమాకు పెద్ద ఎస్సెట్. ఇలాంటి దిగ్గజ సంస్థ మా సినిమాను విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగింది. కంటెంట్‌పై విశ్వాసంతోనే వారు ముందుకు వచ్చారు. మైత్రీ వల్ల కామన్ ఆడియన్స్‌కు ఈ సినిమా చేరువ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
హీరోయిన్ భైరవి అర్ధ్యాతో మీ కెమిస్ట్రీ గురించి చెప్పండి?
ఆకాష్: సినిమాలో మేమిద్దరం బావ-మరదళ్లుగా కనిపిస్తాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే మా క్యారెక్టర్స్ మధ్య వచ్చే లవ్, సరదా గొడవలు, ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటాయి. మా జోడీ తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుందని దర్శకుడు కూడా చెప్పారు.
సినిమా చూసిన తర్వాత మీ అమ్మ సునీత గారి స్పందన ఎలా ఉంది?
ఆకాష్: అమ్మ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పు కొచ్చారు. నా కెరీర్ విషయంలో కథల ఎంపికలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. అయితే ఎప్పుడూ నా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
సినిమా నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ గురించి మీరు ఏమి చెబుతారు?
ఆకాష్: ఈ సినిమా విషయంలో నిర్మాత తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కథకు ఏది అవసరమో అది అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్లారు. కోనసీమలోని అందమైన లొకేషన్లను సహజత్వానికి దగ్గరగా, గ్రాండ్‌గా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిన్న సినిమాగా కాకుండా, ప్రతి ఫ్రేమ్‌లో ఒక మంచి క్వాలిటీ కనిపించేలా ప్రొడక్షన్ విలువలను మెయింటైన్ చేశారు.
చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?
ఆకాష్: రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. వారి అనుభవం మాకు చాలా ఉపయోగపడింది. అలాగే సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
జూన్ 12న విడుదల కానున్న ‘కొత్త మలుపు’ గురించి ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు?
ఆకాష్: ‘కొత్త మలుపు’ ఒక ప్యూర్ ఫ్యామిలీ, లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్. పల్లెటూరి అందాలు, ప్రేమ, నవ్వులు, ఎమోషన్స్, సస్పెన్స్ అన్నీ కలగలిపిన సినిమా. మేమంతా ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఈ సినిమాను జూన్ 12న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షక దేవుళ్లు మా సినిమా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.