
Apple iOS 27 | ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఓఎస్ అప్డేట్తో ముందుకొచ్చింది. ప్రస్తుతమున్న ఓఎస్‌లో పలు మార్పులు చేయడంతో పాటు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ ఐఓఎస్ 27ను
తీసుకొస్తోంది. కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో కొత్త అప్డేట్పై ప్రకటన చేసింది. లిక్విడ్ గ్లాస్ డిజైన్ మార్చడంతో పాటు ఫొటోస్, మొయిల్ యాప్స్‌లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. చైల్డ్ సేఫ్టీ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. దీంతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ మద్దతుతో కూడిన సిరి ఏఐ (Siri AI)ని కూడా ఆవిష్కరించింది.
ఐఓఎస్ 27 ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 11, ఆ తర్వాత వచ్చిన మోడళ్లకు ఈ ఓఎస్ అప్డేట్ అందుతుంది. ఎస్ఈ 2020 మోడల్‌కు కూడా ఐఓఎస్ 27 లభిస్తుంది. ఈ ఫీచర్లను ముందుగా పొందాలంటే యాపిల్ విడుదల చేసిన ఐఓఎస్ బీటా-1 కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికంటే ముందుగానే ఈ ఫీచర్లను వినియోగించాలంటే beta.apple.com. పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ యాపిల్ ఐడీతో సైన్-అప్ అయ్యి టర్మ్స్ అండ్ కండీషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ తర్వాత జనరల్ ఆప్షన్ ఎంపిక చేసుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. బీటా అప్డేట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డెవలపర్ బీటా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్డేట్ పేజీలో కొత్త అప్డేట్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ 27 డెవలపర్ బీటా 1 వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసే ముందు ఐఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది.
ఐఓఎస్ 27కు ఈ ఫోన్లకే: ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022), ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ఎస్ఈ (2020) మోడళ్లకు ఐఓఎస్ 27 ఓఎస్ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.