
ఇంటర్నెట్ డెస్క్: దంబుల్లా వేదికగా ట్రై నేషన్ ఎ సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఎ, భారత్ ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6
వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ శతకంతో సత్తా చాటాడు. కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అయితే భారతజట్టుకు ఆరంభంలోనే వరుస షాక్‌లు తగిలాయి. తొలుత వైభవ్ సూర్యవంశీ (14), తర్వాత కొన్ని బంతులకే.. ప్రభ్ సిమ్రన్ సింగ్ (2) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపించింది. కానీ ప్రియాంశ్ ఆర్య (32), రుతురాజ్ గైక్వాడ్ (101; 114 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ చక్కటి సహకారం అందించాడు. రుతురాజ్‌తో కలిసి.. నాలుగో వికెట్ 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ చేసిన కాసేపటికే రుతురాజ్ పెవిలియన్‌కు చేరాడు.
తర్వాత తిలక్ వర్మ (60; 97 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఔటయ్యాడు. అనంతరం ఆయుష్ బధోని (24; 18 బంతుల్లో, 2 ఫోర్లు) సూర్యాంశ్ షిడ్జే (26*; 14 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో ఆయుష్ బధోని ఔటయ్యాడు. అనుకుల్ రాయ్ (1*) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ 2, చమిక కరుణ రత్నే, వనుజ సహాన్, గరుక సంకేత్ తలో వికెట్ తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.