
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా
లోకేశ్ (Nara Lokesh), అనిత, సంధ్యారాణి, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేశ్.. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రితో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేసిన మంత్రి.. అందరం కలిసి పోరాడటం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.