
అమరావతి: గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల
రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ రోజు సేకరించిన నమూలను ప్రయోగశాలలో పరీక్షించిన అనంతరం వచ్చిన నివేదికలపై రాజమహేంద్రవరం జిల్లా అధికారులతో పవన్ సమీక్షించారు.
నిర్దేశిత పరిమాణం కంటే భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు గోదావరిలో కలుస్తున్నట్లు నివేదికలో తేలిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నెలకోసారి నమూనాలు సేకరిస్తున్నట్లు అధికారులు బదులు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇంత కలుషితమవుతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.
పర్యవేక్షణ సరిగా చేయని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పవన్ ఆదేశించారు. గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విశాఖ (ఉక్కు నగరం): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2, ఎస్టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1,500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అభిమాని సత్యనారాయణను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా యాత్రికుల మృతిపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టోల్ రుసుము ఎగ్గొట్టేందుకు భారీ వాహనాల యజమానులు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు.
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఆరు రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి జాడను అటవీ అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా అనకాపల్లి. ఇప్పటికే ఇది వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం.